ఇయ‌ర్‌ఫోన్స్ వాడితే ప్ర‌మాదమా?

Health Tips

వాహనాల మీద వెళ్లే సమయంలో ఈయర్ ఫోన్స్ పెట్టుకోవడం మంచిది కాదు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ.

చెవులు ఒక స్థాయి వరకు మాత్రమే శబ్దాన్ని వినగలవు. ఆ స్థాయి శబ్దం దాటి ఎక్కువ సమయం విన్నా చెవి నరాలు ఇబ్బందికి గురవుతాయి.

అత్యధిక శబ్దం రావడం వల్ల చెవి నరాలు వైబ్రేట్ అయ్యి అవి వాటి పనిని సక్రమంగా నిర్వర్తించలేవు.

ఒకరి ఇయర్ ఫోన్స్ మరొకరు వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒకరి చెవిలోని ఇన్‌ఫెక్షన్ మరొకరి చెవికి సోకే అవకాశం ఉన్నది.

బడ్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది. బడ్స్‌ను కనీసం వారంలో ఒక్కసారైనా శుభ్రపర్చాలి. దానివల్ల ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉంటుంది.

15 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇయర్ ఫోన్స్ వాడకూడదని అలా వాడాల్సి వస్తే మధ్యమధ్యలో కొంత బ్రేక్ ఇవ్వాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Chair 02

15 నిమిషాల కంటే ఎక్కువ టైం ఇయర్ ఫోన్స్ వాడకూడదని అలా వాడాల్సి వస్తే మధ్యమధ్యలో కొంత బ్రేక్ ఇవ్వాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

లేకుంటే వినికిడి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని వారు చెబుతున్నారు.