TEA

టీ తాగితే  న‌ల్ల‌గా అవుతారా?

Health Tips

టీ తాగితే చ‌ర్మం న‌ల్ల‌గా మారుతుంద‌నేది ఒక అప‌న‌మ్మ‌కం మాత్ర‌మే. చర్మం ఆకృతి, రూపు రేఖలపైన మాత్రమే రంగు ఆధారపడి ఉంటుంది.

చర్మ రంగు మారడానికి టీ మాత్రం కారణం కాదు. టీ, కాఫీ లేదా కెఫిన్ అధికంగా ఉండే ద్రావణాలు చర్మాన్ని ఏవిధంగాను ప్రభావితం చేయవు.

పండ్లు, కూరగాయల్లో మాదిరిగానే టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఉపయోగకరం. ఇవి హృద్రోగాలు, క్యాన్సర్‌ అభివృద్ధిని నిరోధిస్తాయి.

టీని అధికంగా తాగడం వల్ల చర్మం డీహైడ్రేషన్‌కు గురవుతుంది.

రోజులో ఎక్కువసార్లు టీ తాగేవారికి మాత్రమే చర్మం నల్లబడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం నల్లగా మారడానికి అధికంగా టీ తాగడం మాత్రమే కారణం కాకపోవచ్చు. నిద్రలేకపోవడం, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యలవల్ల కూడా చర్మం నల్లగా మారవచ్చు.

చర్మం అనారోగ్యానికి గురవడానికి చాలా కారణాలున్నాయి. సూర్యరశ్మి కావచ్చు. కాలుష్యం కూడా కారణం కావచ్చు.

చర్మం నిగనిగలాడాలంటే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. టీ కాఫీలు మోతాదుకు మించి తీసుకోవద్దు.

ముఖంపై మొటిమలు, జిడ్డు రాకుండా ఉండాలంటే జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దు.