ఈ వార్త‌ల్లో నిజమెంత‌?

జ‌క్క‌న్న‌పై ఆలియాభ‌ట్ అలిగిందా? 

అదేంటి.. ట్రిపుల్ ఆర్ సినిమా ఇంత భారీ స‌క్సెస్ అయితే రాజ‌మౌళిపై ఆలియా భ‌ట్ ఎందుకు హ‌ర్ట్ అయ్యింద‌ని అనుకుంటున్నారా?

ట్రిపుల్ ఆర్ సినిమా భారీ హిట్ అయ్యింది.. అయితే సినిమా మొత్తంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తారు.

#RRR

వారిద్ద‌రి క్యారెక్ట‌రైజ‌ష‌న్ కార‌ణంగా త‌న‌కు త‌క్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చార‌ని ఆలియా భ‌ట్ హ‌ర్ట్ అయ్యింద‌ట‌.

#RRR

రాజ‌మౌళి సినిమాను ఆలియా భ‌ట్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్న‌ద‌ట‌.. కానీ సినిమా విడుద‌ల‌య్యాక త‌న స్క్రీన్ స్పేస్ చూసి ఆలియా భ‌ట్ నిరాశ చెందింద‌ట‌.

అందుకే ట్రిపుల్ ఆర్ సినిమాకు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంసలు అందుతున్నా కూడా ఆలియా భ‌ట్ మాత్రం సినిమాపై ఒక్క‌సారి కూడా స్పందించ‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఆలియా త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి రాజ‌మౌళిని అన్‌ఫాలో చేసింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి

ట్రిపుల్ ఆర్ సినిమా పోస్టుల‌ను కూడా డిలీట్ చేసిన‌ట్టు బాలీవుడ్‌లో వార్త‌లు వ‌చ్చాయి.

అయితే అవ‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని రాజ‌మౌళి అంటే ఆమెకు అమిత‌మైన గౌర‌వం ఉంద‌ని ఆలియా భ‌ట్ స‌న్నిహితులు చెబుతున్నారు.

త‌న స్క్రీన్ టైం గురించి ఏ డైరెక్ట‌ర్ ద‌గ్గర ఆలియా భ‌ట్‌ జోక్యం చేసుకోద‌ని.. అదంతా ద‌ర్శ‌కుడికే వ‌దిలేస్తుంద‌ని అంటున్నారు.

ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌తో త‌న సీన్ల‌ను ప్ర‌శంసిస్తూ ఎన్నో కాల్స్ వ‌స్తున్నాయ‌ని చెప్పుకొచ్చారు.

సో ట్రిపుల్ ఆర్ సినిమా విష‌యంలో రాజ‌మౌళిపై ఆలియాభ‌ట్ అలిగింద‌నే వార్త‌ల్లో నిజం లేన‌ట్టే .