Floral Pattern
Floral Pattern

ఆర్కో ఐరిస్‌ బొటిక్‌ హోమ్‌స్టే

గోవాలోని కర్టోరిమ్‌లో ఉందీ 200 ఏండ్లనాటి పోర్చుగీసు కట్టడం. మొత్తం 1.5 ఎకరాల్లో విస్తరించి ఉంది.  ఒక రాత్రి బస చేయడానికి రూ.6000కు పైగా చార్జ్‌ చేస్తారు.

కాపెల్లా ఫారెస్ట్‌ రిట్రీట్‌

కొండపై మూడు గదులతో నిర్మించారు. ఇక్కడి నుంచి ఐదు నిమిషాల్లో వివిధ బీచ్‌లకు వెళ్లొచ్చు. కాపెల్లాలో స్టే చేయడానికి ఒక రాత్రికి రూ.5000 చెల్లించాలి.

కాసా మెనెజస్‌

గోవా రాజధాని పంజిమ్‌ నుంచి 13 కిలో మీటర్లు. చుట్టూ పచ్చదనం ఆవరించి ఉంటుంది. ‘డిమెనెజెస్‌’ కుటుంబానికి చెందిన 300 ఏండ్లనాటి ఇల్లు ఇది. ఒక పూటకు రూ. 6000 చార్జ్‌ చేస్తారు.

పెరీరాస్‌ గోవన్‌ విల్లా

వాస్కోడగామాలోని పెరారీస్‌ గోవన్‌ విల్లా ఓ సొగసైన కట్టడం. గోవా, భారతీయ వంటకాలు అందుబాటులో ఉంటాయి.

ఓ అబ్రిగో

పంజిమ్‌లో ఇంకా మిగిలి ఉన్న కొన్ని పాత భవంతులలో ఇదొకటి. అడుగడుగునా కళాఖండాలే. ఇక్కడ ఒక్కరాత్రి ఉండాలంటే రూ. 3,200 చార్జ్‌ చేస్తారు.

ఉత్తర గోవాలోని 200 ఏండ్ల‌ నాటి ఇల్లు ఇది. సరదాగా చేపలు పట్టాలనుకునేవారికి ఓ మంచి అవకాశం. స్టే చేయాలంటే పూటకు రూ. 2,200 చెల్లించాలి.

బెర్తాస్‌ రివర్‌వ్యూ

కాన్సియోస్‌ హౌస్‌

ఈ ఇల్లు ఉత్తర గోవాలోని అల్డోనాలో ఉంది. 500 విశాలమైన గదులు, పురాతన ఫర్నిచర్‌ దీని ప్రత్యేకత. పక్కా గోవా వంటకాలు లభిస్తాయి.