ఎక్కిళ్లు ఎంత‌కీ ఆగ‌ట్లేదా?

how to stop hiccups

ఎక్కిళ్లు దాదాపుగా అంద‌రికీ కామ‌న్‌గా వ‌చ్చే స‌మ‌స్యే. సాధార‌ణంగా ఎక్కిళ్లు వ‌స్తే ఒక‌టి రెండు నిమిషాల్లో త‌గ్గిపోతాయి.

కొంత‌మందికి ఒక‌ప‌ట్టాన త‌గ్గ‌వు. త‌ర‌చూ ఈ స‌మ‌స్య వ‌స్తూ ఇబ్బంది పెడుతుంటాయి. నీళ్లు త‌గ్గినా ఈ స‌మ‌స్య అలాగే ఉంటుంది.

ఎక్కిళ్లు వ‌చ్చినప్పుడు ఏడు గుక్క‌ల నీళ్లు తాగాల‌ని కొంద‌రు చెబుతుంటారు.. మ‌రి కొంద‌రేమో ఎవ‌రో తిట్టుకుంటున్నార‌ని అంటుంటారు.

అవ‌న్నీ ప‌క్క‌నపెడితే ఎక్కిళ్లు త‌గ్గాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం..

ఎక్కిళ్లు ఠ‌క్కున ఆగిపోవాలంటే అరస్పూన్ పంచదారను నోట్లో వేసుకొని కాసేపు నాలుకపై ఉంచితే చాలు.

ఐదుసార్లు గట్టిగా ఊపిరి పీల్చుకొని నెమ్మదిగా వదిలితే ఎక్కిళ్లు ఆగిపోతాయి.

గొంతులో నీటితడి లేకపోవడం కారణంగా ఎక్కిళ్లు వస్తుంటాయి. ఎక్కిళ్లు వచ్చిన వెంటనే కొన్ని నీళ్లు తాగితే స‌రిపోతుంది.

గోరువెచ్చని నీళ్లలో కాసింత ఇంగువ వేసుకొని తాగినా ఎక్కిళ్లు ఆగుతాయి.

ఒక్కోసారి ఎక్కిళ్లు ఎంతకీ ఆగకుండా విసిగిస్తుంటాయి. అలాంటప్పుడు ఉసిరి ఆకుల్ని నమిలి మింగితే మంచి ఫలితం ఉంటుంది.