కంటి నిండా నిద్ర లేక ఇబ్బంది పడుతున్నారా?
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో.. కంటి నిండా కునుకు చాలా అవసరం.
అందుకే రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్య నిపుణులు చెబుతుంటారు.
మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచి నిద్ర మీ సొంతమవుతుంది.
నిద్రకు గంట ముందే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేయండి.
నిద్రకు రెండు గంటల ముందు నుంచీ కాఫీ, టీలు బంద్ చేయండి. నిద్రకు మూడు గంటల ముందే భోజనం చేసేయండి
సగానికి సగం మందికి నిద్రపట్టకపోవడానికి కారణం నాసిరకం దిండు, దుప్పటే. నాణ్యత విషయంలో రాజీపడకండి.
మీ మంచాన్ని మినీ ఆఫీస్‌గా మార్చుకోవద్దు. పడక ఉన్నది నిద్రకే.
గురక సమస్య మాత్రమే కాదు. తీవ్ర హెచ్చరిక. వెంటనే శ్వాసకోశ వైద్యుడిని కలవండి.
నిద్రలేమి అనేది ఆందోళన, డిప్రెషన్, ఊబకాయం, మధుమేహం, హృద్రోగ తదితర సమస్యలకు దారితీస్తుంది. కంటినిండా నిద్ర ఉంటేనే, ఒంటి నిండా ఆరోగ్యం.
మహిళలకే నిద్ర అవసరం ఎక్కువ. ఎందుకంటే, వాళ్ల మెదడు పురుషులతో పోలిస్తే మరింత కష్టపడుతుంది.
నిద్రలేమికి పోషక విలువల కొరత, విటమిన్ల లోపం ప్రధాన కారణాలు. వరుసగా కొన్ని వారాలపాటు నిద్రపట్టకపోతే ఏదో తీవ్ర సమస్య ఉన్నట్టే. డాక్టర్‌ను సంప్రదించండి.