మెహందీ మ‌ర‌క‌లు పోవాలంటే ఇలా చేయండి

Beauty Tips

టూత్ పేస్ట్‌కు మెహందీ రంగును తొల‌గించే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. కాబ‌ట్టి పేస్ట్‌ను మెహందీపై పొర‌లా అప్లై చేయాలి. ఆ త‌ర్వాత క‌డిగేస్తే మ‌ర‌క‌లు పోతాయి.

యాంటీ బ్యాక్టీరియ‌ల్ సోప్స్‌లో మెహందీని పోగొట్టే ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వీటిని చేతుల‌కు రాసి 8 నుంచి 10 నిమిషాల త‌ర్వాత చేతుల‌ను క‌డిగేయాలి.

ఒక పాత్రలో కొద్దిగా నీరు తీసుకొని అందులో ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిలో చేతులు మునిగేలా ఉంచాలి.

20 నిమిషాల తర్వాత అందులో నుంచి చేతులు బయటకు తీయాలి. ఇలా చేస్తే మెహందీ మ‌ర‌క‌లు పోతాయి.

వంట సోడాలోనూ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. వంట సోడాను వాడటం వల్ల మెహందీ మరకలు తేలికగా పోతాయి.

అందుకోసం వంటసోడాలో నిమ్మరసం కలిపి మెహందీపై రాయాలి. ఇది ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి.