యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారద్దొంటే.. కుళాయి కింద నీటి మధ్యలో ఉంచి కట్ చేయాలి. దీనివల్ల ఆక్సిడేషన్ ప్రక్రియను ఆపవచ్చు. దీనివల్ల రంగు మారదు.
పండ్లు కట్ చేసినప్పుడు బ్రౌన్ రంగులోకి మారద్దొంటే.. కోసిన వెంటనే అల్లం ద్రావణం వేసిన గిన్నెలో వేయాలి.
అల్లంలో ఉండే సెట్రిక్ యాసిడ్ ఆక్సిడేషన్ ప్రక్రియను నిలిపివేస్తుంది. దీనివల్ల పండ్లు రంగు మారవు.
వంకాయలను కోసేటప్పుడు ముక్కల్ని ఉప్పు కలిపిన నీటిలో వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
పండ్లు కోసేటప్పుడు కూడా ఉప్పు నీటిలో రెండు నిమిషాలు ఉంచి తీస్తే రంగు మారకుండా ఉంటాయి.
తేనె నీటి ద్వారా కూడా పండ్ల రంగు మారకుండా అరికట్టవచ్చు.
గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి కలపాలి. అందులో పండ్ల ముక్కలు వేసి 30 సెకన్ల తర్వాత తీస్తే పండ్లు రంగు మారకుండా ఉంటాయి.
ఒక గాజు గ్లాస్‌లో నీళ్లు తీసుకుని అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పండ్ల ముక్కలను వేస్తే రంగు ఆరవు.
నిమ్మరసం అందుబాటులో లేకపోతే పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ కలపవచ్చు.