కార్బైడ్‌తో పండించిన మామిడి పండ్ల‌ను ఇలా గుర్తించండి

MANGOES

స‌మ్మ‌ర్ వ‌చ్చిందంటే చాలు మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. చాలామంది వెరైటీ వెరైటీ మామిడి పండ్ల‌ను లొట్ట‌లేసుకుని తింటుంటారు.

అయితే చాలామంది వ్యాపారులు ర‌సాయ‌నాల‌తో మామిడి పండ్ల‌ను మ‌గ్గ‌బెట్టి విక్రయిస్తున్నారు. అలాంటివి తిన‌డం ఆరోగ్యానికి చాలా ప్ర‌మాదం.

మ‌రి మామిడి పండ్లు స‌హ‌జంగా పండిన‌వా? కార్బైడ్ ర‌సాయ‌నాల‌తో మ‌గ్గ‌బెట్టి పండించిన‌వా అనేది ఎలా తెలుసుకోవాలో తెలియ‌ట్లేదా..

ఈ నాలుగు ప‌ద్ధ‌తుల ద్వారా మామిడి పండ్లు స‌హ‌జంగా పండాయో లేదో తెలుసుకోవ‌చ్చు.

కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్ల‌పై అక్క‌డ‌క్క‌డా ఆకుప‌చ్చద‌నం ఉంటుంది.

స‌హ‌జంగా పండిన పండ్లయితే కాయ మొత్తం ఒకే రంగులో ఉంటుంది. ముదురు ఎరుపు, పసుపు రంగులో ఈ పండ్లు ఉంటాయి.

స‌హజంగా పండిన మామిడి పండ్లపై నొక్కితే మెత్త‌గా అనిపిస్తుంది. అలాగే ఆ పండ్ల తొడిమ‌ల ద‌గ్గ‌ర మంచి వాస‌న వ‌స్తుంది.

కార్బైడ్ ఉప‌యోగించి పండించిన మామిడి పండ్లు లోప‌ల అక్క‌డ‌క్క‌డా ప‌చ్చిగానే ఉంటాయి. దీంతో పులుపు త‌గులుతుంది.

స‌హ‌జంగా పండిన పండ్ల‌యితే ర‌సం ఎక్కువ‌గా వ‌స్తుంది. అలాగే రుచి కూడా తియ్య‌గా ఉంటుంది.

కార్బైడ్ ఉప‌యోగించి పండించిన పండ్ల‌ను నీటిలో వేస్తే పైకి తేలుతాయి. అదే స‌హ‌జంగా పండించిన‌ పండ్ల‌యితే నీటిలో మునుగుతాయి.