గుడ్డు తాజాదేనా? ఇలా గుర్తించండి

కోడిగుడ్ల‌ను వండే ముందు చ‌ల్ల‌టి నీటిలో వేయండి. అది పూర్తిగా మునిగితే ఫ్రెష్ న్న‌ట్టు. అదే నీళ్ల‌లో తేలితే చాలా రోజులు నిల్వ ఉన్నద‌ని అర్థం..

ఫ్రిజ్‌లో ఐస్‌క్యూబ్స్ పెడుతున్నారా? ట్రేలో నీళ్లు నింపే ముందు కాచి వడపోయండి. మలినాలు తొలిగిపోయి ఐస్‌క్యూబ్స్ తెల్లగా ఉంటాయి.

ఐస్‌క్రీమ్‌ని డీప్ ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ‌గా గ‌డ్డ‌క‌డుతుంది. అదే బాక్స్‌ను ఓ క‌వ‌ర్‌లో చుట్టి పెడితే ఎప్పుడు తిన్నా క్రీమీగా ఉంటుంది.

చేపను గ్రిల్ చేసే ముందు గ్రిల్ మీద అడ్డంగా కోసిన నిమ్మకాయ ముక్కలు పరిచి, దాని మీద చేప ముక్కను ఉంచాలి. అప్పుడు చేప‌లు రుచిగా ఉంటాయి.

నిమ్మకాయ కోసేటప్పుడు కొద్దిసేపు రెండు చేతులతో నలిపితే.. రసం ఎక్కువగా వస్తుంది.

పూరీలు చేసేటప్పుడు తెల్లగా రావాలంటే వేడినూనెలో నాలుగైదు జామ ఆకులు వేయండి.

కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు కొన్ని పాలు పోస్తే దింపిన తర్వాత తెల్లగా ఉంటుంది.

అరటి, బెండ, వంకాయ, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, చిక్కుడు, దొండకాయ వంటి కూరగాయలు వండేటప్పుడు వంటపాత్ర మీద మూత పెట్టకూడదు.

పిండివంటలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు గానీ, బెల్లంముక్క గానీ వేయండి.