మీ పిల్ల‌ల ద్వారా ఇలా ఐటీ మిన‌హాయింపు పొందండి

పిల్ల‌ల‌పై చేసే ఖ‌ర్చుతో పాటు వారిపై పెట్టే పెట్టుబ‌డుల ద్వారా ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఆ మార్గాలేంటో ఒక‌సారి చూద్దాం..

మీ పిల్ల‌ల పేరిట తెరిచిన బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ల‌పై వ‌చ్చే వ‌డ్డీపై సెక్ష‌న్ 10(32) ప్ర‌కారం రూ.1500 వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

ఐటీ చ‌ట్టం 80 సీ కింద మిన‌హాయింపు ల‌భించే రూ.1.50 ల‌క్ష‌లు మ‌దుపు చేయ‌కుంటే.. దానిని పిల్ల‌ల పేరిట ఇన్వెస్ట్ చేసి మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

18 ఏండ్లు దాటిన మీ పిల్ల‌ల ఆదాయం ప‌న్ను శ్లాబ్ కంటే త‌క్కువ‌గా ఉంటే.. మీ ఆదాయంలో కొంత  మ‌నీని గిఫ్ట్‌గా ఇవ్వ‌డం ద్వారా కూడా మ‌దుపు చేయ‌వ‌చ్చు.

సెక్ష‌న్ 80సీ కింద ట్యూష‌న్ ఫీజు చెల్లింపుపై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు వ‌స్తుంది.

ఎడ్యుకేష‌న‌ల్ అల‌వెన్స్ కింద నెల‌కు రూ.100, హాస్ట‌ల్ ఖ‌ర్చుల కింద నెల‌కు రూ.300 చొప్పున ఇద్ద‌రు పిల్ల‌ల‌కు మినహాయింపు ల‌భిస్తుంది.

ఐటీ చ‌ట్టం 80ఈ సెక్ష‌న్‌ కింద ఉన్న‌త విద్య కోసం తీసుకున్న రుణాల వ‌డ్డీ చెల్లింపుపై 8 ఏండ్ల వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చు.

ఐటీ చ‌ట్టం 80డీ సెక్ష‌న్ కింద ఆరోగ్య బీమాప్రీమియం కోసం రూ.25వేలు, ప్రివెంటివ్ హెల్త్ చెక‌ప్ కోసం రూ.5 వేల వ‌ర‌కు రాయితీ వస్తుంది.

ఐటీ చ‌ట్టం 80 డీడీబీ సెక్ష‌న్ కింద 40-80 శాతం వైక‌ల్యం ఉన్న పిల్ల‌ల వైద్య ఖ‌ర్చుల కింద రూ.75వేల వ‌ర‌కు ప‌న్ను రాయితీ వ‌స్తుంది. వైక‌ల్యం 80 శాతం దాటితే రూ.1.25ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను రాయితీ ల‌భిస్తుంది.