Number plates

ఏ వాహ‌నానికి  ఏ రంగు ప్లేట్ వాడ‌తారు?

సాధారణంగా 7రకాల నంబర్‌ ప్లేట్స్‌ అందుబాటులో ఉంటాయి. ఒక్కో కేటగిరి సేవలకు ఒక్కో నంబర్‌ ప్లేట్‌ను వినియోగిస్తారు. సేవల ఆధారంగా వాటికి కలర్స్‌ కేటాయిస్తారు.

NUMBER PLATES

వైట్‌ప్లేట్‌పై బ్లాక్‌ కలర్‌లో నంబర్‌ ఉంటే అది నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ను సూచిస్తుంది. సొంత వాహనాలకు ఈ తరహా నంబర్‌ ప్లేట్‌ను కేటాయిస్తారు.

"

"

యెల్లో ప్లేట్‌పై బ్లాక్‌ నంబర్‌ ఉంటే అవి ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలని సంకేతం. కమర్షియల్‌ అవసరాలకు ఈ తరహా బండ్లను ఉపయోగించుకోవచ్చు. గూడ్స్‌ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనాలని అర్థం.

NUMBER PLATES

బ్లాక్‌ప్లేట్‌పై యెల్లో కలర్‌ నంబర్‌ ఉంటే ఆ వాహనాలు అద్దె సర్వీస్‌కు అనుమతించబడినట్టు. అంటే ఆ వాహనాలను ఓనర్‌ రెంటెడ్‌ బేస్‌ మీద అద్దెకు ఇవ్వొచ్చు. చాలా మంది రెంటల్స్‌ సర్వీస్‌ అందిస్తారు. 

"

"

గ్రీన్‌ బోర్డుపై వైట్‌ కలర్‌లో నంబర్‌ ఉంటే ఆ వాహనాలు ఎలక్ట్రిక్‌ వాహనాలని సంకేతం.

NUMBER PLATES

యెల్లో ప్లేట్‌పై రెడ్‌ కలర్‌లో నంబర్‌ ఉంటే ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కల్గిన వాహనాలని అర్థం. అంటే కొత్త వాహనాలను విక్రయించడానికి ఏర్పాటు చేసే ఎక్స్‌పోలకు తరలించేందుకు ఇలాంటి నంబర్‌ ప్లేట్‌ వాహనాలను ఉపయోగిస్తారు.

"

"

బ్లూ ప్లేట్‌పై వైట్‌ కలర్‌లో నంబర్‌ ఉంటే ఆ వాహనాలు కాన్సులేట్‌ కార్యాలయ వాహనాలని సంకేతం.

number  plates

గ్రీన్‌ ప్లేట్‌పై యెల్లో నంబర్‌ ఉంటే అవి ఎలక్ట్రిక్‌ వాహనాలు. ట్రాన్స్‌పోర్ట్‌, కమర్షియల్‌ పర్పస్‌గా వినియోగించుకోవచ్చని అర్థం.