cockroach

ఇలా బొద్దింక‌ల‌ను త‌రిమేయండి

Household Tips

బేకింగ్ సోడా, చక్కెర రెండింటినీ కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి. చక్కెరతో పాటు బేకింగ్ సోడా తినడం వల్ల గ్యాస్ అధికంగా ఏర్పడి బొద్దింకలు చనిపోతాయి.

బిర్యానీలో ఆకులను పౌడర్ చేసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లాలి. ఈ వాసన భరించలేక బొద్దింకలు చనిపోతాయి.

Household tips

సబ్బు నీటిలో బొద్దింకలు అసలు ఉండలేవు. కాబట్టి నీటిలో కొంచెం సబ్బు కలపాలి.

ఈ నీటిని బొద్దింకల మీద చల్లాలి. వచ్చే వాసనకి బొద్దింకలు కొద్ది క్షణాలకే అక్కడి నుంచి వెళ్లిపోవడమో, చనిపోవడమో జరుగుతుంది.

Household Tips :

అమ్మోనియం బొద్దింకలకు చిరాకు తెప్పిస్తుంది. బకెట్ నీటిలో అమ్మోనియం కల‌పాలి.

ఆ నీటిని బొద్దింకలు తిరిగే చోట సింక్, బాత్‌రూమ్, వంటగదిలో చల్లాలి. ఈ పద్ధతి బొద్దింకలను శాశ్వతంగా నిర్మూలించడానికి సహాయపడుతుంది.

వంటింట్లో బొద్దింకల బెడద ఎక్కువగా ఉంటే బోరిక్ పౌడర్, చక్కెరను, గోధుమ పిండిలో వేసి చిన్న ఉండ‌లుగా చేసి అన్ని మూలలా పెట్టాలి.

Household Tips

ఈ ఉండ‌ల‌ను తిన‌డం వ‌ల్ల బొద్దింకలు కంటికి కనిపించకుండా పోతాయి.

దోసకాయ ముక్కలను బాగా ఎండబెట్టాలి. ఎండిన ముక్కలను కబోర్డులో, అల్మరాల్లో ఉంచితే బొద్దింక బెడద నుండి తప్పించుకోవచ్చు.

తాజాగా ఉండే దోసకాయ తొక్క తీసి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో ఉంచితే ఆ వాసనకు రాకుండా ఉంటాయి.