Inside look

Inside look

Inside look

Inside look

Household tips

ఇంట్లో ఫ్రిజ్‌ను  ఎలా ప‌డితే అలా వాడేస్తున్నారా?

చాలామందికి ఫ్రిజ్ పనితీరు, దాని నిర్వహణపై తగినంత అవగాహన ఉండదు. దాంతో తరచూ సమస్యలు వ‌స్తుంటాయి.

అందుకే ఫ్రిజ్ నిర్వహణలో కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం.

కొత్తగా ఫ్రిజ్ కొన్నప్పుడు కనెక్షన్ పెట్టక ముందు అరగంట పాటు ఫ్రిజ్ డోర్ తీసి ఉంచాలి.  మీరు వాడేది పాత మోడల్ ఫ్రిజ్ అయితే దానికి స్టెబిలైజర్ తప్పనిసరి. 

Circled Dot

Household tips

ఫ్రిజ్ పని తీరు కంప్రెసర్ మీద అధారపడి ఉంటుంది. కంప్రెసర్ సమస్యలున్నాయా లేదా అనేది పరిశీలించుకోవడం మంచిది. 

ఫ్రిజ్ వెనుక ఉండే కాయిల్స్ మీద చెత్తా చెదారం పడకుండా చూడాలి. లేదంటే కాయిల్స్ సరిగ్గా పని చేయక కంప్రెసర్ మీద భారం పడి ఫ్రిజ్ పనితీరు మందగిస్తుంది.

Household tips

క‌నీసం నెలకోసారైనా ఫ్రిజ్‌లోని పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలు కడిగి ఆరనివ్వాలి.

White Bag
Curved Arrow

బయటివైపు శుభ్రం చేసేందుకు కోలిన్ లిక్విడ్ వాడాలి. లేకపోతే క్రిమికీటకాలు చేరే అవకాశం ఉంటుంది.

2 గంటలకు మించి విద్యుత్ కోత ఉన్నప్పుడు ఫ్రిజ్ డోర్ తెరచి పెట్టాలి. లేకుంటే లోపలి పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంది.

విద్యుత్ ఆదా కోసమని రాత్రి ఫ్రిజ్‌ను ఆఫ్ చేయకూడదు. నెలల తరబడి ఊరెళ్లితే మాత్రమే ఫ్రిజ్ స్విచ్చాఫ్ చేయాలి. ఫ్రిజ్‌ను ఆఫ్ చేసేముందు అందులో ఏమీ ఉండకుండా చూసుకోవాలి.

Curved Arrow

పిల్లలు తరచుగా ఫ్రిజ్ తెరిచి చూస్తుంటారు. తిరిగి తలుపు సరిగ్గా వేయలేరు. దీనివల్ల లోపలి చల్లదనమంతా బయటికి వెళ్లిపోయి కంప్రెసర్ మీద భారం పడుతుంది.