Refrigerator

ఏవైనా ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?

Household Tips

కూర‌గాయ‌లు, పండ్లు, వంట‌సామ‌గ్రి ఇలా అన్నింటినీ ఫ్రిజ్‌లో పెడుతుంటాం. అయితే కొన్నింటిని ఫ్రిజ్‌లో పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిది.

మ‌రి ఏవి ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. వేటిని పెట్ట‌కూడ‌దో ఇప్పుడు ఒక‌సారి చూద్దాం..

అర‌టి పండ్ల‌ను ఫ్రిజ్‌లో పెడితే వాటి రంగు మారుతుంది.. కానీ అనారోగ్య స‌మ‌స్య‌లేమీ రావు. కాబ‌ట్టి వాటిని ఫ్రిజ్‌లో ఉంచ‌వ‌చ్చు.

ఉల్లిగ‌డ్డ‌ల‌ను ఫ్రిజ్‌లో పెడితే మురిగిపోయే అవ‌కాశం ఉంది. వాటిని గాలి ఆడేలా ఆర‌బోయాలి.

దోస కాయ‌ల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌డం వ‌ల్ల అందులో ఉండే నీటి శాతం త‌గ్గుతుంది. దీంతో త్వ‌ర‌గా పాడ‌వుతాయి.

పుచ్చ‌కాయ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిజ్‌లో పెడితే చాలు. కానీ క‌ట్ చేసిన త‌ర్వాత మాత్రం ఫ్రిజ్‌లో ఉంచ‌వ‌ద్దు.

క‌ట్ చేసిన పుచ్చ‌కాయ ముక్క‌ను ఫ్రిజ్‌లో ఉంచితే లోప‌లి ఉష్ణోగ్ర‌త‌కు త్వ‌ర‌గా రుచి మారిపోతుంది.

ఫ్రై చేసిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో ఉంచి తిన‌డం వ‌ల్ల పొట్ట స‌మ‌స్య‌లు వస్తాయి.

ఫ్రైడ్ ఫుడ్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచి తిరిగి వేడి చేసి తిన‌డం వ‌ల్ల గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఫ్రిజ్‌లో ఆకుకూర‌లు పెట్టేట‌ప్పుడు ఆకుకూర‌లు త‌డిగా లేకుండా చూసుకోవాలి. త‌డిగా ఉంటే త్వ‌ర‌గా పాడ‌య్యే అవ‌కాశం ఉంది.

ఆకుకూర‌ల‌ నాడ‌లు క‌త్తిరించి ఆకుల‌ను క‌వ‌ర్ల‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే ఎక్కువ‌ రోజులు నిల్వ ఉంటాయి.