బోనాలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి

# Bonalu Festival

అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్ర‌దాయం ఉంది.

కొండ కోన‌ల్లో మ‌నిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవ‌త‌గా చేసుకుని ప్ర‌కృతి త‌న‌కు ఇచ్చిన ప‌త్రి, పువ్వు, కొమ్మ‌, ప‌సుపు కుంకుమ‌, నీళ్లు, ధాన్యం, కూర‌గాయ‌ల‌ను స‌మ‌ర్పించాడు.

అప్పుడు ప్రారంభ‌మైన ఈ స‌మ‌ర్ప‌ణ‌మే బోనాల వ‌ర‌కు వ‌చ్చింది.

పూర్వ కాలం నుంచే ఉన్న ఈ బోనాల‌కు ఒక్కో ప్రాంతంలో ఒక్కో చ‌రిత్ర ఉంది.

1

600 ఏళ్ల నాటి ప‌ల్ల‌వ రాజుల కాలంలో తెలుగు నేల‌పై బోనాల పండుగ ప్రాశ‌స్త్యం పొందింద‌ని ప్ర‌తీతి. 

15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవ‌రాలు ఏడు కోల్ల ఎల్ల‌మ్మ న‌వదత్తి ఆల‌యాన్ని నిర్మించి, బోనాలు స‌మ‌ర్పించార‌ట‌.

2

1676లో క‌రీంన‌గ‌ర్ హుస్నాబాద్‌లో ఎల్ల‌మ్మ‌గుడిని స‌ర్వాయి పాప‌న్న క‌ట్టించి, ఆ దేవ‌త‌కు బోనాలు స‌మ‌ర్పించిన‌ట్టు కైఫీయ‌తుల్లో గౌడ‌నాడులు గ్రంథంలో ఉంది.

3

1869లో జంట‌న‌గ‌రాల్లో ప్లేగు వ్యాధి మ‌హ‌మ్మారిలా వ‌చ్చి ప్ర‌బ‌లడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

4

దైవాగ్ర‌హానికి గుర‌య్యామ‌ని భావించిన అప్ప‌టి ప్ర‌జ‌లు.. గ్రామ దేవ‌త‌ల‌ను శాంత‌ప‌రచ‌డానికి, ప్లేగు వ్యాధి నుంచి త‌మ‌ను తాము కాపాడుకోవ‌డానికి చేప‌ట్టిన క్ర‌తువే ఈ బోనాలు.