చాలా కాలం తరువాత న‌టి జెనీలియా రీ ఎంట్రీ  ఇవ్వ‌బోతుంది.

చివ‌ర‌గా 2012లో రానా హీరోగా న‌టించిన నాఇష్టం సినిమాలో న‌టించింది.

ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌ర‌మే 2013లో బాలీవుడ్ హీరో, నిర్మాత రితేష్ ధేశ్‌ముఖ్ ను వివాహం చేసుకుంది.

ఆ తర్వాత సినిమాల‌కు దూర‌మైంది. లేటెస్ట్‌గానే ఈమె మిస్ట‌ర్ మ‌మ్మి సినిమాతో బాలీవుడ్‌లో రీ ఎంట్రి ఇచ్చింది

మాజీమంత్రి గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి త‌న‌యుడు కిరీటి హీరోగా ప‌రిచ‌య‌వుతున్న సినిమాతో సౌత్‌లో రీ ఎంట్రి ఇస్తుంది.  

రాధాకృష్ణ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. వారాహి చ‌ల‌న చిత్రం సంస్థ నిర్మిస్తుంది. శ్రీలీలా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తుంది.

జెనీలియా ఏ పాత్ర పోషిస్తున్నదో చిత్ర యూనిట్‌ ఇంకా వెల్లడించలేదు..