ఎలా ఉందంటే..

గ‌రుడ‌ను చంపి న‌రాచిని ఆధీనంలోకి తెచ్చుకున్న రాఖీభాయ్ (య‌ష్‌)కి ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి? ప్ర‌ధాని రమికాసేన్‌తో వైరం ఏంటి? శ‌త్రువుల నుంచి త‌న సామ్రాజ్యాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం రాఖీ ఏం చేశాడు? అనేది స్టోరీ

ఫ‌స్ట్ పార్ట్‌లో హీరోయిజం ఎలివేష‌న్స్‌, అమ్మ సెంటిమెంట్‌తో ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ అయ్యారు. రెండో భాగంలో కూడా డైరెక్ట‌ర్ ఇదే పంథా ఫాలో అయ్యాడు.

KGF 2 Review

Arrow

తొలిపార్ట్‌లో రాఖీభాయ్‌ ఎదిగిన వైనాన్ని చూపించగా..సీక్వెల్‌ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి రాభీభాయ్‌ ఏం చేశాడన్నదానిపై దృష్టిపెట్టారు

ప్ర‌థ‌మార్ధంలో రాఖీ భాయ్ శ‌త్రువులు అంద‌రినీ త‌న ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అధీర ఆగ‌మ‌నంతో క‌థ‌లో కీల‌క మలుపు తీసుకుంటుంది.

ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో అసలు రాఖీభాయ్‌ లక్ష్యమేమిటో స్పష్టమవుతుంది. అయితే ద్వితీయార్థంలో కథా గమనం కాస్త పట్టుతప్పింది. రాఖీ అధీరా మ‌ధ్య పోరాటం అంత‌గా ఆక‌ట్టుకోదు.

Review

Arrow

ప్రీ క్లైమాక్స్‌లో ప్ర‌ధాని ర‌మికా సేన్‌తో రాఖీ త‌ల‌ప‌డ‌టం ఉత్కంఠ పెంచుతుంది. కానీ కొన్ని సీన్లు ఏ మాత్రం కన్విన్సింగ్‌గా అనిపించ‌వు.

పార్లమెంట్‌లోకి వెళ్లి ప్ర‌ధానమంత్రిని హెచ్చ‌రించ‌డం నాట‌కీయంగా క‌నిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ మినహాయిస్తే ద్వితీయార్థంలో ఎలాంటి మలుపులు కనిపించవు.

Learn More

కథా గమనంలో ల్యాగ్‌ వస్తుందనుకునే ప్రతి సందర్భంలో తల్లి సెంటిమెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకుల్ని సినిమాలో ఇన్‌వాల్వ్‌ చేసే ప్రయత్నం చేశారు.

Arrow

హీరోహీరోయిన్ల మధ్య తొలిభాగంలో వచ్చే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేదు. ద్వితీయార్థంలో మాత్రం ఇద్దరి మధ్య బంధాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.

Review

Arrow

రాఖీభాయ్‌గా యష్‌ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో పాటు మ‌ద‌ర్ సెంటిమెంట్ సీన్ల‌లో య‌ష్ న‌ట‌న క‌ట్టిప‌డేస్తుంది.

అధీరా పాత్రలో సంజయ్‌దత్‌ చక్కటి విలనీ పండించారు. ఆయన ఆహార్యం భీతిగొలిపే విధంగా ఉంది.

KGF 2 Review

Arrow

ప్రధానమంత్రి రమికాసేన్‌గా రవీనాటాండన్‌ మంచి నటనతో మెప్పించింది. సీబీఐ అధికారిగా రావు రమేష్‌ తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు.

Review

Arrow

రవి బస్రూర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కథలోని ఫీల్‌ను చక్కగా ఎలివేడ్‌ చేసింది. ఓ రకంగా బీజీఎమ్‌ ఈ సినిమాకు పెద్దబలమని చెప్పొచ్చు.