మొదటి కంటెస్టెంట్‌గా కార్తీక దీపం ఫేమ్ కీర్తి భట్ అడుగుపెట్టింది. కార్తీక దీపం కంటే ముందు మనసిచ్చి చూడు సీరియల్‌తో కీర్తి గుర్తింపు తెచ్చుకుంది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రతో పాపులర్ అయిన సుదీప.. చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20కి పైగా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ చేసింది.
మూడో కంటెస్టెంట్‌గా సిరి హన్మంత్ బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజానికి బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్‌లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడనే వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తనదైన యాంకరింగ్‌తో ఆకట్టుకున్న నేహా చౌదరి బిగ్‌బాస్ హౌస్‌లోకి నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది
జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆరో కంటెస్టెంట్‌గా ఆయన హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
నటి శ్రీ సత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. 2015లో మిస్ విజయవాడ టైటిల్ గెలుచుకుంది. ముద్దమందారం, త్రినయని వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఏపీలోని కొవ్వూరుకు చెందిన అర్జున్ పలు షార్ట్ ఫిలింస్‌లో నటించాడు. 2013లో చిన్న సినిమా అనే చిత్రంతో హీరోగా మారాడు. ప్లే బ్యాక్, పెళ్లి కూతురి పార్టీ వంటి సినిమాల్లోనూ అర్జున్ నటించాడు.
జబర్దస్త్ చూసేవారికి గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన కామెడీతో బుల్లి తెర ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న గీతూ.. ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
మెరీనా అబ్రహం గోవాలోని క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించింది. జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఉయ్యాల జంపాలా సీరియల్‌లోనూ నటించింది.
రోహిత్ సహానీ కూడా పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. రోహిత్, మెరీనా ఇద్దరూ ఒక డ్యాన్స్ రియాల్టీ షోలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 24 సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు.ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నాడు.
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన వాసంతి.. సిరిసిరి మువ్వలు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. క్యాలీఫ్లవర్, వాంటెడ్ పండుగాడ్ సినిమాల్లో నటించింది.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు జడ్చర్ల కుర్రాడు షానీ సల్మాన్. హ్యాపీ, రెడీ రామ్ అసుర్ వంటి పలు చిత్రాల్లోనూ నటించాడు.
ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసి ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది ఇనయా సుల్తానా. తాజాగా బుజ్జీ ఇలారా సినిమాలో నటించింది.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సూర్య మిమిక్రీ ఆర్టిస్టుగా పలు షోలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. గరుడ వేగ, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించాడు
పటాస్ షోతో గుర్తింపు పొందిన ఫైమా అనతికాలంలోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. పటాస్ అయిపోయిన తర్వాత జబర్దస్త్ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకుల ఫేవరేట్‌గా మారింది.
కామన్ మ్యాన్ కేటగిరీలో 18వ కంటెస్టెంట్‌గా ఆదిరెడ్డి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ షోలకు రివ్యూలు ఇస్తూ.. ఇప్పుడు అదే హౌస్‌లోకి అడుగుపెట్టాడు.
రాజశేఖర్ కల్యాణ వైభోగం, మనసు మమత సీరియల్స్‌లో నటించాడు. అలాగే అడవి శేష్ నటించిన మేజర్ సినిమాలోనూ చిన్న పాత్ర చేశాడు. బిగ్‌బాస్ 5 విన్నర్ సన్నీకి క్లోజ్ ఫ్రెండ్.
టీవీ 9లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ న్యూస్‌తో గుర్తింపు తెచ్చుకుంది ఆరోహి రావు అలియాస్ అంజలి. అంతకుముందు పలు షార్ట్‌ఫిలింస్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.
సింగర్‌గా టాలీవుడ్‌లో రేవంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన 200కి పైగా పాటలు పాడాడు. ఇండియన్ ఐడల్ టైటిల్ గెలుచుకుని జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.