చలికాలంలో రోగాలు రాకుండా ఇలా జాగ్రత్తపడండి

చలికాలం చాలా ప్రమాదకరమైంది. వస్తూ వస్తూ దగ్గు, జలుబు తదితర శ్వాస సంబంధ సమస్యలను వెంటబెట్టుకుని వస్తుంది. ఆ రుగ్మతలకు అడ్డుకట్ట వేయడానికి అనేక మార్గాలున్నాయి.

బయటికి వెళ్తున్నప్పుడు స్వెటర్‌, టోపీ, మాస్క్‌ తప్పనిసరి. బయట పొగ ఉన్నప్పుడు అటువైపు వెళ్లకపోవడమే మంచిది.

ధ్యానం, వ్యాయామం ఉత్తమం. ఆందోళన, ఒత్తిడి తక్కువగా ఉన్నప్పుడే మన శరీరం ఇన్ఫెక్షన్లతో సమర్థంగా పోరాడగలదు.

వృద్ధులు, తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడేవారు డాక్టర్ల సలహాతో ఇన్‌ఫ్లుయెంజా టీకాలు తీసుకోవాలి.

నగర ప్రాంతాల ప్రజలు బయటి పొగ ఇండ్లలోకి చేరకుండా కిటికీలు మూసి ఉంచాలి.

గాలి బాగా ప్రసరించేలా ఫ్యాన్లు ఆన్‌ చేసి ఉంచాలి. కాలుష్యం ఇంట్లోకి ప్రవేశించకుండా ఫిల్టర్లను బిగించాలి.

వేడిగా ఉన్న పోషకాహారం తీసుకోవాలి. తగినంత నిద్ర అవసరం. చురుగ్గా ఉండాలి.

పొట్టుతీయని ధాన్యం, మాంసం, చేపలు, చిక్కుడు జాతి గింజలు, మసాలాలు, తాజాపండ్లు, కూరగాయలు రోగ నిరోధక శక్తిని ఇస్తాయి.

మాయిశ్చరైజర్లు, సూర్యకాంతి నుంచి సంరక్షించే క్రీములు వాడాలి. ఎక్కువగా నీళ్లు తాగాలి.

ఆహారంలో సీ విటమిన్‌ను భాగం చేసుకోవాలి. దీంతో జలుబు, ఫ్లూ తదితర సమస్యల ముప్పు తగ్గుతుంది.

విటమిన్‌-బి12, విటమిన్‌-డి3 తగిన మోతాదులో అందకపోతే అలసట అధికం అవుతుంది. తగినంత సహజ కాంతి శరీరం మీద పడేలా చూసుకోవాలి.