health  tips

పంటి నొప్పి వేధిస్తున్న‌దా?

జామ ఆకుల‌ను నీళ్ల‌లో బాగా క‌డిగి న‌మిలితే పంటి నొప్పి త‌గ్గుతుంది.

జామ ఆకుల్లో విట‌మిన్ సీ, బీ, ఫ్లెవ‌నాయిడ్స్, టానిన్స్‌, ఐర‌న్‌, లైకోపిన్‌, పొటాషియం, మెగ్నీషియం, మాంగ‌నీస్ ఉన్నాయి. ఇవ‌న్నీ పంటి నొప్పిని త‌గ్గించ‌డంలో ప‌నిచేస్తాయి.

ఉప్పు క‌లిపిన నీటిని పుక‌లించ‌డం ద్వారా కూడా పంటి నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు.

వెల్లుల్లి, ల‌వంగాల‌ను తీసుకుని దానిని పేస్ట్ చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెడితే ప‌ది సెక‌న్ల‌లో నొప్పి త‌గ్గుతుంది.

ప‌చ్చి ఉల్లిపాయ క్రిమి నాశ‌క ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండ‌టం వ‌ల్ల దానిని 3 నిమిషాలు న‌మిలితే నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

అర‌స్పూన్ ల‌వంగాలు, కొద్దిగా కొబ్బ‌రి నూనె, టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు ఉప్పు క‌లిపిన మిశ్ర‌మాన్ని పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి మాయ‌మ‌వుతుంది.

వెల్లుల్లిలో యాంటీబ‌యాటిక్స్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. వెల్లుల్లి రెబ్బ‌ల్ని మెత్త‌గా చేసి దానికి చిటికెడు మెత్త‌ని ఉప్పును క‌లిపి పుచ్చిన పంటిపై రాస్తే చిటికెలో నొప్పి త‌గ్గుతుంది.