పరిగడుపున ఇవి తింటున్నారా? జాగ్రత్త !!

ఉదయాన్నే తినడానికి ఏం దొరక్కపోతే స్వీట్లు, కేకులు, చక్కెరతో చేసిన ఫుడ్‌ తింటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడినట్టే. 

దీనివల్ల అజీర్తి వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

తీపి పదార్థాలే కాదు మరికొన్నింటికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటంటే..

పరిగడుపున సిట్రస్‌పండ్లను తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల అల్సర్, గ్యాస్ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు.

ఉదయం పూట ఉప్పు, కారం అధికంగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు.

ఆయిల్‌ఫుడ్ తీసుకుంటే కడుపులో గ్యాస్‌ఫామ్ అవుతుంది. నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకూడదు. 

ఇవి తీసుకుంటే ఛాతిలో మంట, ఉదర సంబంధిత రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది.

కార్బోహైడ్రేట్లు ఉన్న పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. సోడా, కూల్‌డ్రింక్స్‌ను ఉదయం పూట తీసుకోకూడదు. 

టమాటాలను కూడా పరిగడుపున తినకూడదు. ఇందులో టానిక్ యాసిడ్ ఉండటంతో పరిగడుపున తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పరిగడుపున స్వీట్లు తినడం వల్ల పొట్ట భాగంలో కొవ్వు అధికంగా ఏర్పడుతుంది. దీన్ని నివారించడానికి వాడిపోయిన మందార పూలతో చేసిన ఔషధ టీ తాగాలి. 

ఉదయంపూట ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది