గుర‌క పెడుతున్నారా? ఈ టిప్స్ మీ కోస‌మే..

#Health Tips

గురక పెట్టేవారు పడుకునే ముందు గుప్పెడు అటుకులను తింటే గురక రాకుండా ఉంటుంది.

గురక సమస్యతో బాధపడే వారు అతిగా తినకపోవడమే మంచిది.

గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత కారణంగా గురక బాధిస్తుంది. ఆల్కహాల్ అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతగా రిలాక్స్ అయిపోవడం వలన గురక మరింత ఎక్కువ అవుతుంది. 

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గురక సమస్య తీవ్రతరం అవుతుంది. ఆల్కాహాల్‌కు దూరంగా ఉండమే మంచిది.

బరువు అదుపులో ఉంచుకోవడం వల్ల గురకకు చెక్ పెట్టవచ్చు. నిద్రకు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకూడదు.

అలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్‌ను తీసుకోవద్దు. నిద్ర వేళలు క్రమబద్ధంగా ఉండాలి.

వెల్లకిలా పడుకోవడానికి బదులుగా ఒక వైపునకు ఒరిగి పగడుకోవాలి. మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోవాలి.

నిద్రించే ముందు గోరు వెచ్చని నీటిని గొంతులో కాసేపు ఆపి తాగడం వల్ల గురక రాదు.

గురకతో బాధపడే వారు రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.

టీ స్పూన్ పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి తాగాలి. క్రమం తప్పకుండా వారం పాటు ఇలా చేస్తే గురక తగ్గుతుంది.