పెండ్లి పీటలు ఎక్కబోతున్న హన్సిక 

టాలీవుడ్‌ హీరోయిన్‌ హన్సిక మోత్వానీ త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కబోతోంది.

White Lightning
White Lightning

దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక.. అప్పట్లో వరుస సినిమాలతో ఆకట్టుకుంది.

White Lightning

ఆ తర్వాత లావు కావడం, సక్సెస్‌ లేకపోవడంతో అవకాశాలు తగ్గి టాలీవుడ్‌కు దూరమైంది. కానీ కోలీవుడ్‌లో మాత్రం రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉంది.

చాలా ఏండ్ల తర్వాత మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హన్సిక.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.

White Lightning

ఇలాంటి సమయంలో హన్సిక పెండ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

ఈఫిల్‌ టవర్‌ ఎదుట ఓ వ్యక్తి తనకు ప్రపోజ్‌ చేస్తున్న పిక్‌ను పోస్టు చేసి తన పెళ్లి విషయాన్ని చెప్పింది.

White Lightning
White Lightning

కాబోయే భర్త సోహైల్‌ను అందరికీ పరిచయం చేసింది. అతనెవరో కాదు హన్సిక చిన్ననాటి స్నేహితుడే.

2020లో హన్సిక ఒక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని మొదలు పెట్టింది. ఆ కంపెనీలో సోహైల్‌ పార్ట్‌నర్‌ కూడా.

తమ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో ఎన్నో పెళ్లిళ్లు సెలబ్రేట్‌ చేసిన హన్సిక, సోహైల్‌.. ఇప్పుడు పెండ్లి పీటలు ఎక్కబోతున్నారు.

డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌ కోటలో హన్సిక పెండ్లి జరగనుంది.