తాజా పండ్లు,  డ్రై ఫ్రూట్స్‌లో ఏవి మంచివి?

తాజా పండ్లు, ఎండిన ఫలాలు.. ఆరోగ్యానికి ఏవి మంచివి? అన్న తర్జనభర్జన ఉండనే ఉంటుంది.

పండ్లను సహజంగా ఎండబెట్టడం వల్ల చక్కెర, కేలరీలు అధికంగా ఉంటాయి. 30 తాజా ద్రాక్షపండ్లలో 12 గ్రాముల షుగర్‌ ఉంటే.. అన్నే డ్రై ఫ్రూట్స్‌లో 48 గ్రాముల చక్కెర ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్‌లో నీటి శాతం తక్కువ. అలాగే పండ్లను ఎండబెట్టే క్రమంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైటో కెమికల్స్‌ తగ్గిపోతాయి.

ఎండిన పండ్లతో పోలిస్తే తాజా పండ్లలోనే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ ఎక్కువ.

అలా అని ఎండిన పండ్లను తినొద్దని కాదు కానీ, శరీర బరువును అనుసరించి కేలరీలను అంచనా వేసుకొని ఆరగించాలి.

కిస్మిస్‌, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ వంటి డ్రై ఫ్రూట్స్‌, యాపిల్‌ చిప్స్‌, ఆప్రికాట్‌, అరటి చిప్స్‌ ఆరగించడానికి సౌకర్యంగా ఉంటాయి. వీటిని తింటే తాజా పండ్ల కంటే ఎక్కువ ప్రయోజనం.

తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్‌.. గ్లూకోజ్‌ రెండింటిలోనూ సమానమే.

డైటింగ్‌ చేసేవారు డ్రై ఫ్రూట్స్‌ తక్కువగా తినాలి. వీటివల్ల కేలరీలు పెరుగుతాయి. కడుపు నిండిన భావన ఉండదు. డ్రై ఫ్రూట్స్‌ ఉదయాన్నే తినడం మేలు. దీనివల్ల గరిష్ఠ ప్రయోజనం పొందుతారు.

తాజా పండ్లలో నీటి శాతం ఎక్కువ. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. విటమిన్లు, ఖనిజాల శాతం కూడా తాజా పండ్లలో ఎక్కువ.

తాజా పండ్లు అనేక వ్యాధులను నియంత్రిస్తాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

రోజూ పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. మెదడు చురుకుదనం పెరుగుతుంది.

తాజా పండ్లలోని ఏ, బీ, సీ వంటి ముఖ్యమైన విటమిన్లను శరీరం త్వరగా గ్రహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం.