ప‌ట్టుబ‌ట్ట‌ల‌పై మ‌ర‌క‌లా?

ఈ ట్రిక్స్‌తో పోగొట్టండి

పట్టుబట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడి నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఆ నీటిలో ఉతకాలి.

పట్టుబట్టల మీద చాక్లెట్ మరకలు పడితే వేడినీటిలో జాడించి ఉతికితే పోతాయి. 

పెరుగు, వెన్న వంటి మరకలు పడితే మరకపై ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించాలి.

పట్టుబట్టల మీద ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు.

అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.

బురద మట్టి మరకలు పడితే పట్టు వ‌స్త్రాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది.

షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.

ప‌ట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో లేదా పేపర్, కాటన్ సంచుల్లోనే ఉంచాలి. పట్టుబట్టలు ఉన్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి.

పట్టుబట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా కాకుండా కవరులో పెట్టి పెట్టాలి.

పట్టుబట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే ముడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.