skincare

చలికి చర్మం పగులుతుందా?

winter beauty tips

చలికాలంలో చర్మం తేమను కోల్పోతుంది. దీనివల్ల పొడిబారినట్టు అవుతుంది. కొన్ని సందర్భాల్లో చర్మం పగులుతుంది కూడా. అందుకే చర్మం తేమను కోల్పోకుండా ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.

ఒక టేబుల్ స్పూన్ బాదాం పౌడర్. 2 టేబుల్ స్పూన్ల పచ్చి పాలు తీసుకొని, ఈ రెండింటినీ పేస్టులా చేసి ముఖానికి అప్లె చేయాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా నీరు చిలుకరించి మసాజ్ చేయాలి. 

01

బాదాంలో ఉండే విటమిన్ ఈ, ఫ్యాటీ యాసిడ్స్, పాలలోని మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. చర్మం పగలదు.

ముఖం శుభ్రంగా కడిగి తేమ లేకుండా తుడవాలి. తర్వాత కాటన్ బాల్‌ను గ్లిజరిన్‌లో ముంచాలి. పెదాలకు అంటకుండా ముఖానికి అప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత కడుక్కోవాలి.

02

గ్లిజరిన్ వివిధ రకాల స్కిన్ సమస్యలను నివారిస్తుంది. ఈ నేచురల్ మాయిశ్చరైజర్‌తో చర్మానికి తేమ అందిస్తుంది.

పెరుగు, మజ్జిగను సమంగా తీసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని బాడీ మొత్తం అప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 

03

పెరుగులో జింక్, కాల్షియం, విటమిన్ బి6, ఇతర ఎంజైమ్స్ ఉన్నాయి. ఇవి చర్మంలోని మచ్చలను తేలిక పరుస్తాయి.

బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనెను పేస్టులా చేసుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

04