రాత్రి నిద్ర పట్టడం లేదా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
నిద్రపోవడానికి గంట ముందు కప్పు హెర్బల్ టీ తాగడం అలవాటు చేసుకోవాలి.
కుదిరితే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. సంగీతం వినండి. అంతేగానీ ఫోన్లు, కంప్యూటర్లకు దూరంగా ఉండండి.
పడకగదిలో వెలుతురు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. పడకగది వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంటేనే హాయిగా నిద్ర పడుతుంది.
రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం అలవాటుగా మార్చుకోవాలి. దీంతో రాత్రి హాయిగా నిద్రపడుతుంది.
రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదని కొందరు మధ్యాహ్నం కునుకు తీస్తుంటారు. కొన్ని రోజులపాటు అలా చేయడం ఆపేయండి.
ఓ ప్రణాళిక ప్రకారం దినచర్య పెట్టుకుంటే.. సాయంత్రానికి చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. దీనివల్ల ఒత్తిడి తగ్గి, హాయిగా నిద్రపడుతుంది.
ఈ నియామాలను వారం రోజులపాటు ప్రయత్నిస్తే సరిపోతుంది. ఇదే అలవాటుగా మారిపోతుంది.