చిట్టీని జాతిరత్నాలు డైరెక్టర్‌ కొట్టాడా?

జాతిరత్నాలు సినిమాతో చిట్టీగా అందరికీ గుర్తుండిపోయింది ఫరియా అబ్దుల్లా.

ఆ ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న చిట్టీ.. నాగార్జున బంగార్రాజు సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది.

ఇప్పుడు లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ సినిమాతో హీరోయిన్‌గా మళ్లీ అందరి ముందుకొస్తుంది ఫరియా. 

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఇందులో భాగంగానే జాతిరత్నాలు షూటింగ్‌ సమయంలో డైరెక్టర్‌ అనుదీప్‌ కేవీ తనను కొట్టాడన్న విషయాన్ని బయటపెట్టింది.

అనుదీప్‌ కావాలని కొట్టలేదని.. అదేదో సరదాగా జరిగిపోయిందని ఫరియా చెప్పుకొచ్చింది.

జోక్స్‌ వేసినప్పుడు నవ్వుతూ పక్కన ఉన్నవాళ్లను కొట్టడం అనుదీప్‌కు అలవాటు.. అలా ఒకసారి నన్ను చేత్తో అలా టచ్‌ చేశాడంతే అని వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.

తను సినిమాల్లోకి రావడానికి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్ కారణమని ఫరియా చెప్పుకొచ్చింది.

ఒకసారి నాగ్‌ అశ్విన్‌ తమ కాలేజీకి వచ్చాడని.. ఆ సమయంలో తనను చూసి యాక్టింగ్‌ చేస్తారా అని అడిగారని తెలిపింది.

ఆ తర్వాత ఆయన నంబర్‌ తీసుకుని ఫాలో అప్‌ చేశానని. ఆడిషన్‌ ఇవ్వగా జాతిరత్నాలు సినిమాకు సెలెక్ట్‌ అయ్యానని పేర్కొంది.