జుట్టు రాలడం తగ్గాలా? ఈ ఫుడ్‌ తీసుకోండి

పాలకూరలో ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, రాగి లాంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టుకు ఎంతో మేలుచేస్తాయి.

కేశాల పెరుగుదలకు సహకరించే మరో మంచి ఆహారం బీట్‌రూట్‌. ఇది శరీరంలో ఐరన్‌ స్థాయులను పెంచి జుట్టు రాలిపోకుండా నిరోధిస్తుంది.

దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇది జుట్టు కుదుళ్లకు పోషణనిస్తుంది. దోసకాయ రసాన్ని నీళ్లు, పుదీనా ఆకులు, నిమ్మరసంతో కలుపుకొని తాగితే మరీ మంచిది.

ఉసిరికాయలో విటమిన్‌-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర కణజాలం నశించి పోవడాన్ని తగ్గిస్తుంది. కొత్తగా జుట్టు పెరిగేలా చేస్తుంది.

నారింజలో విటమిన్‌-సి, ఫోలేట్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు హామీగా నిలుస్తాయి.

స్ట్రాబెర్రీ.. ఫోలేట్‌, విటమిన్‌-బి9, విటమిన్‌-సి, మాంగనీస్‌, బయోటిన్‌, ఒమేగా-3, పొటాషియం లాంటి పోషకాలకు చిరునామా.

క్యారెట్‌లో విటమిన్‌- ఎ, ఇ ఉంటాయి. ఇవి కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి.