సోషల్‌ మీడియాలో ఏది పడితే అది పోస్ట్‌ చేస్తున్నారా

సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందే ఆలోచించండి. కంటెంట్‌ ఎలాంటిదో గమనించండి. అది మీ వ్యక్తిగత సమాచారమైనా, తప్పుడు సమాచారమైనా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది

ప్రతీది అప్‌డేట్‌ చెయ్యడం వల్ల మీరే నష్టపోతారు. మీ గురించి తెలియాల్సిన వారికి తెలిస్తే చాలు. ప్రపంచానికంతా తెలియాలనే రూలేం లేదు.

మీకు తెలియని కంటెంట్‌ను ఫార్వర్డ్‌ చేయొద్దు. షేర్‌ చేయాలనుకుంటే అది నిజమో కాదో.. www.factly.com, www.boomlive.inలో చెక్‌ చేయండి.

మీ వ్యక్తిగత సమాచారం మరింత గోప్యంగా ఉండాలంటే పబ్లిక్‌, ప్రైవేట్‌ వైఫైలో ఓటీపీలతో లాగిన్‌ అవ్వొద్దు.

ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేస్తున్నప్పుడు వీపీఎన్‌ ఉపయోగించండి. లేకపోతే టీఓఆర్‌, డక్‌డక్‌ గోగా వంటి బ్రౌజర్లను ఉపయోగించండి.

వీలైతే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ మెసేజింగ్‌ అప్లికేషన్లు వాడండి. గ్యాడ్జెట్స్‌, యాప్స్‌లో మీ డిఫాల్ట్‌ ఫాస్‌ వర్డ్‌లను మార్చండి.

చిన్నప్పటినుంచే పిల్లలకు సోషల్‌ మీడియా అకౌంట్స్‌, ఇతర ఆన్‌లైన్‌ వ్యవహారాలు వద్దు. ఒకవేళ కావాలనుకుంటే మీరే వారిని గైడ్‌ చెయ్యండి.

ఎదిగే పిల్లలనే సైబర్‌ నేరస్థులు లక్ష్యం చేసుకుంటున్నారు. అడల్ట్‌ కంటెంట్‌ పంపి.. తమ దారికి తెచ్చుకొని, తల్లిదండ్రుల డబ్బులు కొల్లగొడుతున్నారు. అందుకే తల్లిదండ్రులూ తస్మాత్‌ జాగ్రత్త!

మీరు సైబర్‌ నేరగాళ్ల బారినపడితే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చెయ్యండి, సైబర్‌క్రైమ్స్‌ వెబ్‌సైట్‌లో, దగ్గర్లోని పోలీస్‌ స్టేషన్‌ లో  ఫిర్యాదు చెయ్యండి.