కీర్తి భ‌ట్ గురించి   ఇవి తెలుసా !

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6లో  తొలి కంటెస్టెంట్‌గా కీర్తి కేశ‌వ్ భ‌ట్ ఎంట్రీ ఇచ్చింది.

White Lightning
White Lightning

క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో కీర్తి భ‌ట్ జ‌న్మించింది.

White Lightning

చిన్న‌త‌నం నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండ‌టంతో యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది.

ఉన్న‌త విద్యాభ్యాసం పూర్తి కాగానే క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది.

White Lightning

క‌న్న‌డ‌లో వ‌రుస‌పెట్టి మూడు సీరియ‌ల్స్‌లో న‌టించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ప‌లు స‌నిమాల్లోనూ న‌టించింది.

మ‌న‌సిచ్చి చూడు సీరియ‌ల్‌తో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి భ‌ట్‌.

White Lightning
White Lightning

మ‌న‌సిచ్చి చూడు సీరియ‌ల్‌లో భాను అనే పాత్ర‌లో అద్భుతంగా న‌టించి తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్ర‌స్తుతం కార్తీక దీపం సీరియ‌ల్‌లో హిమ పాత్ర‌లో కీర్తి భ‌ట్‌ న‌టిస్తోంది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో త‌న జీవితంలో జ‌రిగిన ఓ విషాద సంఘ‌ట‌న‌ను పంచుకుంది.

ఆరేండ్ల క్రితం జ‌రిగిన ఓ రోడ్డు ప్ర‌మాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన‌ట్లు తెలిపింది.

ఇప్పుడు త‌నూ భ‌ట్ అనే ఓ చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న‌ట్లు కీర్తి భ‌ట్ పేర్కొంది.