Inside look

Inside look

Inside look

Inside look

Tech tips

ఫోన్ మారుస్తున్నారా.. ఇలా చేయ‌డం త‌ప్ప‌నిస‌రి !!

ఈరోజుల్లో వారినొక స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో జ‌నాలు కూడా వెంట‌వెంట‌నే ఫోన్ల‌ను మార్చేస్తున్నారు.

Tech tips

అయితే కొత్త ఫోన్ మోజులో ప‌డి చాలామంది పాత ఫోన్‌లోని విలువైన స‌మాచారాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నారు.

దీనివ‌ల్ల ఫొటోలు, వీడియోలు, డేటా, కాంటాక్టులు సైబ‌ర్ నేర‌గాళ్ల చేతిలో ప‌డుతున్నాయి. కాబ‌ట్టి ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి.

ముందుగా మీ పాత ఫోన్‌లోని డేటాను భద్రపరుచుకోవాలి. స్టోరేజీ సమస్య ఉంటే అనవసరమైనవన్నీ డిలీట్‌ చేసి, మిగిలిన డేటాను బ్యాకప్‌ చేస్తే సరిపోతుంది.

TECH TIPS

ఇందుకు స్మార్ట్‌ఫోన్‌లో క్లౌడ్‌స్టోరేజ్‌ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఐఫోన్‌ యూజర్స్‌ ‘ఐక్లౌడ్‌’లో డేటాను బ్యాకప్‌ చేసుకోవచ్చు.

White Bag

TECH TIPS

వాట్సాప్‌లోని డేటానూ బ్యాకప్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో సెట్టింగ్స్‌ – చాట్‌- చాట్‌ బ్యాకప్‌పై క్లిక్‌ చేస్తే మీ డేటా గూగుల్‌ డ్రైవ్‌లో సురక్షితంగా ఉంటుంది.

పాత ఫోన్‌లో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, మెసేంజ‌ర్‌, పేటీఎం, ఫోన్ పే వంటి అప్లికేష‌న్ల నుంచి లాగ్ అవుట్ కావ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

TECH TIPS

అన్ని యాప్స్‌కు సంబంధించి పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడం కష్టమనిపిస్తే.. థర్డ్‌పార్టీ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ యాప్‌ల సాయం తీసుకోవచ్చు.

White Bag

TECH TIPS

స్పీకర్‌, స్మార్ట్‌వాచ్‌ వంటివి పాత ఫోన్‌తో అనుసంధానమై ఉంటే.. డివైజ్‌లను ‘అన్‌పెయిర్‌’ చేయాలి.

Circled Dot

చివరగా ‘రిస్టోర్‌ ఫ్యాక్టరీ సెట్టింగ్స్‌’లో మీ ఫోన్‌ను రీసెట్‌ చేయాలి. దీనివల్ల మీ పాత ఫోన్‌ ఫార్మాట్‌ అవుతుంది. డేటా అంతా మాయం అవుతుంది.