Marvin Mckinney

టాటా మోటార్స్‌ కొత్త ఎలక్ట్రిక్ కారు. దీని పేరు 'Curve' EV.

టాటామోటార్స్‌ దీన్ని ఇటీవలే  ఆవిష్కరించింది. మార్కెట్లోకి ఇంకా రాలేదు

దీని ఫీచర్స్‌, అదిరిపోయే డిజైన్‌, మైలేజ్‌ రేంజ్‌, ఇంటీరియర్‌ ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికే రిలీజైన రెండు ఎల‌క్ట్రిక్ కార్లు టాటా నెక్సాన్‌, టైగర్‌ ఈవీలకు మంచి రెస్సాన్స్‌ వస్తున్నది.

ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ.లు ప్ర‌యాణించ‌వ‌చ్చు.ఇందులో మరో ఫ్యాన్సీ టచ్‌ కూడా ఉంది.  ఫ్రేమ్‌లెస్‌ డోర్‌ విండులు ఈ కారుకు ఇచ్చారు. ఇంకా అన్నింటిలాగే పనోరమిక్‌ సన్‌రూఫ్‌ ఉంది.

ఇంటీరియర్‌ కూడా అదిరిపోయింది. లోపల అన్నీ స్మార్ట్‌ ఫీచర్సే. ఇందులో రెండు మానిటర్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటెయిన్‌మెంట్‌, ఇంకోటి రివర్స్‌ తీసుకునేటపుడు చూడ్డానికి

 ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే.. వెహికిల్‌ టు వెహికిల్‌, వెహికిల్‌ టు లోడ్‌ ఛార్జింగ్‌ పెట్టకునే చాన్స్‌ ఉందట. అంటే ఈ కారుతో మరో కారుకు చార్జింగ్‌ చేసుకోవచ్చు.  ఇది కొత్త కాన్సెప్ట్‌.