ఏ పాలు మంచివి?

ఆవు పాల‌తో పోలిస్తే

Which Milk is Healthiest

సోయా, బాదం, ఓట్స్‌, బియ్యం, కొబ్బరి, బఠానీ.. తదితర పదార్థాల నుంచి ను నానబెట్టి, బాగా రుబ్బి, వడగట్టి తీసే ద్రవాన్నే ‘పాలు’ అని పిలుస్తున్నారు. వాటిలోని పోషకవిలువల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో ఏవి మంచివంటే..

కప్పు బాదం పాలలో 37 కేలరీలు మాత్రమే ఉంటాయి. సాధారణ పాలతో పోలిస్తే ఇది పావువంతే. కప్పు పాలలో 8 గ్రాముల ప్రొటీన్‌ ఉంటే, బాదం పాలలో ఒక గ్రాము మాత్రమే ఉంటుంది.

ఒక కప్పు ఓట్స్‌ పాలలో 2 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. సాధారణ పాలతో పోలిస్తే ఇది తక్కువే. ఫైబర్‌ పెంచుకోవాలనుకుంటే ఓట్స్‌ ధాన్యమే ఉత్తమం. ఓట్స్‌ పాలతో పోలిస్తే.. ఓట్స్‌ ధాన్యంలో రెండు రెట్లు ఫైబర్‌ లభిస్తుంది.

సోయా పాలు అన్ని విధాలా ఆవుపాలకు సమానం. పోషకాల పరంగాను సరిసాటిగా నిలుస్తాయి. ఒక కప్పు సోయా పాలలో 6 గ్రాముల ప్రొటీన్‌, 105 కేలరీలు, 89 శాతం మంచి కొవ్వు ఉంటాయి. క్యాల్షియం, విటమిన్‌-ఎ, డి లభిస్తాయి.

తురిమిన కొబ్బరి నుంచి తీసే ఈ పాలలో సహజంగానే తీపిశాతం ఎక్కువ. కప్పు కొబ్బరి పాలలో 0.5 గ్రాముల ప్రొటీన్‌, 5 గ్రాముల శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటాయి. అయితే, ఇది చెడు కొలెస్ట్రాల్‌ పెరిగేందుకు దోహదపడుతుంది.

బఠానీ పాలలో ప్రొటీన్‌ అధికం (కప్పునకు 8 గ్రాములు). ఇక బ్రౌన్‌ రైస్‌ నుంచి తయారయ్యే పాలు సహజంగానే తీయగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువ.

అదే ఆవు పాలు అయితే.. ప్రొటీన్లు, క్యాల్షియం, పొటాషియం విటమిన్‌- బి, ఎ, డి సహజసిద్ధంగా ఉంటాయి. పైగా ఆరోగ్యానికి చాలా మంచివి.

ఆవు పాల నుంచి మీగడ, వెన్న, పనీర్‌ వంటి ఉప ఉత్పత్తుల తయారీ చాలా సులభం. మొక్కల నుంచి తీసిన పాలతో ఆ వెసులుబాటు తక్కువే.