మెదడు తినే అమీబా.. దక్షిణ కొరియాలో బయటపడ్డ వ్యాధి

మెదడు తినే వ్యాధి ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది.దక్షిణ కొరియాలో 50 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధి బారిన పడి కన్నుమూశాడు. అతనికి థాయిలాండ్‌లో ఈ వ్యాధి సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

మెదడు తినే ఈ వ్యాధి.. నదులు, చెరువుల్లో ఉండే నయిగ్లేరియా ఫ్లవరీ అనే ఏక కణ జీవి ద్వారా సోకుతుంది. దీన్ని నయిగ్లేరియా ఫ్లవరీ ఇన్‌ఫెక్షన్‌ అని పిలుస్తారు.

అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మాత్రమే నీటిలో ఉన్న ఈ నయిగ్లేరియా ఫ్లవరీ మనుషులకు సోకుతుంది.

ఇది మనుషుల నుంచి మనుషులకు సోకదు. కేవలం నీటిలో ఉన్న అమీబా శరీరంలోకి ప్రవేశించడం ద్వారానే వస్తుంది.

ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి బ్రెయిన్‌కు చేరుతుంది. ఆ తర్వాత మెదడు నరాలను దెబ్బతీస్తుంది.

ఈ అమీబా శరీరంలోకి ప్రవేశించినప్పుడు తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి.