Urvashi Rautela

ది లెజెండ్‌ కోసం  20 కోట్లు తీసుకుందా?

చేసింది త‌క్కువ సినిమాలే అయినా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఊర్వ‌శీ రౌతెలా.

White Lightning
White Lightning

మోడ‌లింగ్‌తో కెరీర్ మొద‌లుపెట్టిన ఊర్వ‌శి.. ప‌లు అందాల పోటీల్లో స‌త్తా చాటింది.

White Lightning

ఆ త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి అడుగుపెట్టి స‌న‌మ్ రే, హేట్ స్టోరీ 4 వంటి సినిమాల‌తో బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్‌లో ఊర్వ‌శికి చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు ఏమీ రాలేవు.

White Lightning

బాలీవుడ్‌లో అడ‌పాద‌డ‌పా అవ‌కాశాలు వ‌స్తుండ‌టంతో ఊర్వ‌శి.. తాజాగా సౌత్ ఇండ‌స్ట్రీపై ఫోక‌స్ చేసింది.

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త శ‌ర‌వ‌ణ‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ది లెజెండ్ సినిమాలో నటించి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ఊర్వ‌శి రౌతెలా.

White Lightning
White Lightning

ఈ క్ర‌మంలోనే ది లెజెండ్ సినిమాలో ఊర్వ‌శి న‌టించ‌డానికి కార‌ణ‌మిదే అని ఒక వార్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ది లెజెండ్ సినిమా కోసం ఊర్వ‌శి రౌతెలాకు శ‌ర‌వ‌ణ‌న్ భారీగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా కోసం ఊర్వ‌శి ఏకంగా రూ.20కోట్ల వ‌ర‌కు పారితోషికం తీసుకున్న‌ట్లు స‌మాచారం.

సాధార‌ణంగా ఊర్వ‌శి రౌతెలా ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంది.

కానీ ఈ మ‌ధ్య పెద్ద‌గా అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో అందాల ఆర‌బోత‌తో అప్పుడ‌ప్పుడు ప్రేక్ష‌కుల దృష్టిలో ప‌డే ప్ర‌య‌త్నం చేస్తోంది.

ఈ క్ర‌మంలోనే సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెలుగులో బ్లాక్ రోజ్ సినిమాకు క‌మిట్ అయ్యింది.

ఈ సినిమా కోసం ఊర్వ‌శి కోటి రూపాయ‌ల లోపే రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ట‌. 

కానీ శ‌ర‌వ‌ణ‌న్ సినిమాకు రూ.20 కోట్లు తీసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.