అలా మనసు గెల్చుకోలేరు

Shama Sikander

క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ న‌టి, నిర్మాత‌ ష‌మా సికింద‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇది సినిమా ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే కాద‌ని.. మిగతా రంగాల్లోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చింది.

సినీ ఇండ‌స్ట్రీలో గ‌తంలో నిర్మాత‌లు ఎక్కువ‌గా వేధించేవార‌ని.. అయితే ఇప్పుడు ప‌రిశ్ర‌మ కాస్త బాగుప‌డుతున్న‌ద‌ని పేర్కొంది.

సినిమాల‌పై ఇష్టంతో వ‌స్తున్న కొత్త నిర్మాత‌ల‌కు హీరోయిన్ల‌కు గౌర‌వ‌మిస్తున్నార‌ని ష‌మా సికింద‌ర్‌ చెప్పింది.

ఇలా ప్రొఫెష‌న‌లిజం పెర‌గ‌డం వ‌ల్ల త‌ప్పుడు ఆలోచ‌న‌ల‌కు ఆస్కారం ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఏదేమైనా మ‌హిళ‌ల మ‌న‌సుల్ని భౌతికంగా ఇబ్బంది పెట్టి గెలుచుకోలేర‌ని తెలిపింది.

మంచి మ‌న‌సుతోనే వారికి ద‌గ్గ‌ర‌వ్వాల‌ని స్ప‌ష్టం చేసింది.