దిశా ప‌టానీకి బంప‌ర్ ఆఫ‌ర్‌

#Disha Patani

Lined Circle

లోఫ‌ర్ సినిమాతో సినీ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది దిశా ప‌టానీ.

రెండో సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లిపోయిన దిశా ప‌టానీ.. ఎంఎస్ ధోనీ, బాఘీ2 చిత్రాల‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఒక‌వైపు సినిమాలు.. మ‌రోవైపు సోష‌ల్‌మీడియాలో హాట్ ఫొటోల‌తో కుర్ర‌కారు గుండెల్ని దోచేసింది.

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న దిశా ప‌టానీకి బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చింది.

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించే ఛాన్స్ కొట్టేసింది.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న‌ ప్రాజెక్ట్ కే సినిమాలో దిశా ప‌టానీ ఒక హీరోయిన్‌గా ఎంపికైంది.

ఈ సినిమాలో ఇప్ప‌టికే దీపికా ప‌దుకొణె, అమితాబ్ న‌టిస్తున్నారు. తాజాగా దిశా కూడా ఈ సినిమాలో న‌టిస్తున్న‌ట్లు తెలిసింది.

ప్రాజెక్ట్ కేలో న‌టిస్తున్న‌ట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దిశా తెలిపింది.