నా పెండ్లికి న‌న్ను కూడా పిలుస్తారుగా.. అథియా శెట్టి ఫ‌న్నీ రిప్లై

సెల‌బ్రెటీల పెళ్లిళ్ల‌పై ఎప్పుడూ ఏదో ఒక‌ వార్త రావ‌డం ఇప్పుడు కామ‌న్ అయిపోయింది.

తాజాగా సునీల్ శెట్టి గారాల‌ప‌ట్టి అథియా శెట్టి విష‌యంలో కూడా ఇలాంటి వార్త‌నే ఒక‌టి వైర‌ల్ అవుతుంది.

టీమిండియా క్రికెట‌ర్ కేఎల్ రాహుల్‌తో అథియా శెట్టి ప్రేమ‌లో ఉంద‌ని చాలాకాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

వీళ్లిద్ద‌రి రిలేష‌న్‌షిప్‌పై ఎంతోకాలంగా వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ.. దీనిపై ఎవ‌రూ అఫిషియ‌ల్‌గా స్పందించ‌లేదు.

ఈ క్ర‌మంలో అథియా, కేఎల్ రాహుల్ పెండ్లిపై ఈ మ‌ధ్య వార్త‌లు రావ‌డం ఎక్కువ‌య్యాయి.

అథియాతో పెండ్లి ఒప్పుకున్న కేఎల్ రాహుల్ కుటుంబ స‌భ్యులు.. సునీల్ శెట్టితో మాట్లాడార‌ని.. అత‌ను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మూడు నెల‌ల్లో ఇద్ద‌రి పెండ్లి జ‌ర‌గ‌బోతుంద‌ని.. అథియా శెట్టి ద‌గ్గ‌రుండి మ‌రి ఈ వివాహ వేడుక‌ల‌ ఏర్పాట్లు చూసుకుంటుంద‌ని ప‌లు మీడియా క‌థ‌నాలు రాసుకొచ్చాయి.

అయితే ఈ వార్త‌ల‌ను కొట్టిపారేసిన అథియా శెట్టి.. ఫ‌న్నీగా కౌంట‌ర్ ఇచ్చింది.

మూడు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే ఈ వివాహానికి న‌న్ను కూడా పిలుస్తార‌ని ఆశిస్తున్నా అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో క్లారిటీ ఇచ్చింది.

ఈ పెళ్లి వేడుక‌ల‌ను అటు సునీల్ శెట్టి కూడా ఖండించాడు.