ప్రియుడితో ఆమీర్‌ కూతురి ఎంగేజ్‌మెంట్‌

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమీర్‌ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌ ప్రేమాయణం ముందడుగు వేసింది.

White Lightning
White Lightning

ప్రియుడు, సెలబ్రెటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపుర్‌ శిఖారేతో ముంబైలో ఐరాఖాన్‌ నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

White Lightning

ఆమీర్‌ ఖాన్‌ మొదటి భార్య రీనా దత్తా కుమార్తె అయిన ఐరాఖాన్‌ రెండేళ్లుగా నుపుర్‌తో రిలేషన్‌లో ఉంది.

నుపుర్‌తో ప్రేమ వ్యవహారాన్ని ముందు నుంచి ఐరా ఖాన్‌ చాలా ఓపెన్‌గానే ఉంచింది.

White Lightning

ఎప్పటికప్పుడు నుపుర్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వచ్చింది.

ఈ క్రమంలో ఇప్పుడు వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్‌ను ముంబైలో ఘనంగా నిర్వహించారు.

White Lightning
White Lightning

దీనికి ఆమీర్‌ఖాన్‌, రీనాదత్తాతో పాటు ఆమీర్‌ఖాన్‌ రెండో భార్య కిరణ్‌రావు, నటి ఫాతిమా సనా షేక్‌ హాజరయ్యారు.

ప్రస్తుతం ఐరా ఖాన్‌  ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి