త్వ‌ర‌లోనే బిగ్‌బాస్ ఫేం

భానుశ్రీ పెళ్లి?

యాంక‌ర్ భాను శ్రీ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌నే వార్త ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

– Anonymous

బుల్లితెర‌పై అర‌కొర ప్రొగ్రామ్స్‌తో కెరీర్ మొద‌లుపెట్టిన భానుశ్రీ.. బిగ్‌బాస్ షోతో ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది.

ఆ క్రేజ్‌తో ఒక‌వైపు బుల్లితెరపై రచ్చ చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర మీద న‌టించే అవ‌కాశాల‌ను అందుకుంటుంది.

ప‌లు సినిమాల్లో స‌హాయ పాత్ర‌ల్లో న‌టించ‌డ‌మే కాకుండా.. మౌనం, న‌ల్లమ‌ల వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా మెప్పించింది భానుశ్రీ.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భానుశ్రీ త‌న గురించి ఎప్ప‌టిక‌ప్పుడూ అభిమానుల‌తో షేర్ చేసుకుంటూనే ఉంటుంది.

ఈ క్ర‌మంలో భాను శ్రీ  పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంద‌నే ప్ర‌చారం నెట్టింట జోరుగా సాగుతోంది.

తాను ఇలా ఉందంటే కార‌ణం ఒక వ్య‌క్తి అని.. హైద‌రాబాద్‌లో త‌న‌కంటూ ఒకరు ఉన్నార‌నే ధైర్యం అత‌ను ఇచ్చాడ‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది భానుశ్రీ.

ఆ వ్య‌క్తినే పెళ్లి చేసుకుంటాన‌ని అప్పుడే భాను శ్రీ స్ప‌ష్టం చేసింది.

అయితే ఇప్పుడు భానుశ్రీ అత‌న్నే పెళ్లి చేసుకోబోతుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన ఈ వార్త‌లో నిజ‌మెంత ఉందో తెలియాలంటే భానుశ్రీ స్పందించాల్సిందే.