శ్రీసత్య ఎంగేజ్‌మెంట్‌ అందుకే క్యాన్సిల్‌ అయ్యిందా?

Bigg boss 6 telugu

బుల్లితెర నుంచి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది త్రినయిని ఫేమ్‌ శ్రీసత్య.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మొదలు శ్రీ సత్య ఎవరితో కలవకుండా తన పరిధిలో తానే ఉంటుంది.

శ్రీ సత్య తీరు చూసి ఆడియన్స్‌ మాత్రమే కాదు.. హౌజ్‌మేట్స్‌ కూడా ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

అందుకే ఇదే కారణాన్ని చూపి శ్రీ సత్యను తోటి హౌజ్‌మేట్స్‌ నామినేట్‌ కూడా చేస్తున్నారు.

అయితే అందరితో కలవకపోవడం, తన కంటూ ఓ పరిధిలో ఉండటానికి కారణమేంటో శ్రీ సత్య తాజాగా చెప్పుకొచ్చింది.

తాను ఇలా మారడానికి కారణమేంటనేది.. సిసింద్రీ టాస్క్‌లో బయటపెట్టింది శ్రీ సత్య.

తనను ఓ వ్యక్తి మోసం చేశాడని.. అతని వల్ల ఆత్మహత్యాయత్నం కూడా చేశానని చెప్పుకొచ్చింది.

ఇది చూసి మనోవేదనకు గురై వాళ్ల అమ్మ అనారోగ్యంతో మంచాన పడిందని కన్నీరు పెట్టుకుంది.

టీనేజీలో ఉన్నప్పుడు పవన్‌ రెడ్డి అనే వ్యక్తిని శ్రీ సత్య ప్రేమించింది. అతనితో నిశ్చితార్థం కూడా జరిగింది.

కానీ ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చిన ప్రేమాయాణం.. పెండ్లి పీటల వరకు వెళ్లకుండానే ముగిసిపోయింది.

ఇదే విషయమై బిగ్‌బాస్‌ హౌస్‌లో చెప్పిన శ్రీ సత్య.. పవన్‌ రెడ్డి చీట్‌ చేశాడని పేర్కొంది.

ఇదిలా ఉంటే శ్రీ సత్య తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని పవన్‌ రెడ్డి ఖండించాడు.

తాను మోసం చేయలేదని.. అలాంటి ఉద్దేశమే ఉంటే తనతో ఎంగేజ్‌మెంట్‌ వరకు ఎందుకు వస్తానని సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చాడు.