ఫ్రూట్స్ ను ఆరోగ్యాన్ని పెంచే ఆహారంగా మాత్రమే చూస్తారు. కానీ అవి అందాన్ని పెంచేవి కూడా.. ముఖ్యంగా ఈ ఐదు పండ్లు అందాన్ని పెంచుతాయి.
అరటి పండ్లలో ఉండే ఫైబర్, మినరల్స్, మెగ్నీషియం, పొటాషియం వంటివి మనకు మేలు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇందులో ఉండే విటమిన్లు ఎ, బి, ఇ లు యాంటీ ఏజింగ్ ఏజెంట్‌లా పనిచేస్తాయి. అందుకే వీలైనంత ఎక్కువగా అరటి పండ్లు తినాలి. తేనెతో కలిపి అప్పుడప్పుడు ముఖంపై ప్యాక్ వేసుకుంటే మంచిది.
కమలా ఫలాల్లోని విటమిన్ సి స్కిన్ టెక్చర్స్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. చర్మంపై ఉండే గాయాల్ని, మచ్చల్ని పోగొడుతుంది. వీటి తొక్కలు కూడా ఎంతో మంచివి.
కమలా పండ్లను ఎండబెట్టి, పొడి చేసి, నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చు అంటారు. డాక్టర్‌కే కాదు. బ్యూటీషియన్‌కు కూడా దూరంగా ఉండొచ్చు.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అందాన్ని కాపాడుతాయి. చర్మంపై పేరుకుపోయిన మలినాల్ని తొలిగిస్తాయి. పొడి చర్మం కలవారికి ఆపిల్ చాలా మేలు చేస్తుంది
బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
బొప్పాయి గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం మెరుస్తూ ఉంటుంది.
నిమ్మకాయలోని సి విటమిన్ చర్మ సౌందర్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మలినాల్ని తొలిగిస్తుంది. చర్మాన్ని, జుట్టును కాపాడుతుంది.