కాక‌ర‌తో అందాన్ని పెంచుకోండి ఇలా..

#Beauty Tips

కాక‌ర‌కాయ‌ను ర‌సంలా చేసి ముఖానికి రాయాలి. 5 నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని క‌డుక్కోవాలి. రోజూ ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా అవుతుంది.

కాకర పేస్ట్‌లో కరివేపాకు పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య చాలా వరకు తగ్గుతుంది.

కాక‌ర‌కాయ పేస్ట్‌లో జాజికాయ పొడి, పెరుగు కలిపిన మిశ్ర‌మాన్ని ముఖంపై ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు.

కాకర ముక్కలను నీటిలో మరిగించాలి. ఆ నీటిలో కాటన్‌ బాల్‌ ముంచి క్లీన్‌ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న ఎలాంటి మచ్చలైనా దూరమవుతాయి

కాకర పేస్ట్‌లో కాసింత అలోవెరా జ్యూస్‌, పసుపు కలిపి దురద ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఆరిన తర్వాత కడిగితే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

పైల్స్ ఉన్న‌వారు ముల్లంగి తినొచ్చా?

Watch next