బియ్యం క‌డిగిన నీటితో ఇన్ని లాభాలా?

బియ్యం కడిగిన నీటిని పులియబెట్టినప్పుడు అందులో బి విటమిన్లు తయారవుతాయి. దీనికి ఇతర పదార్థాలు కలిపి తీసుకుంటే తక్షణ శక్తి అందుతుంది.

పేగుల ఆరోగ్యానికి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి, మెటబాలిజం పెరగడానికి తోడ్పడుతుంది.

బియ్యం కడిగిన నీటితో స్నానం చేస్తే మృత కణాలు పోవడంతోపాటు చర్మం మెరుస్తుంది. దురద వల్ల వచ్చే మంట తగ్గుతుంది.

బియ్య‌పు నీరు సహజ మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది. ప్రతిరోజూ దీంతో ముఖం కడుగుతూ ఉంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

కప్పుబియ్యం కడిగిన నీటిలో స్పూన్ తేనె, కొన్ని చుక్కల లావెండర్ నూనె కలిపి జుట్టుకు రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే జుట్టు పట్టులా మెరుస్తుంది.

బియ్యం నీటిని నేరుగా తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు కావలసిన పోషణ అందుతుంది.

బియ్యం క‌డిగిన నీటిలో ఉండే బయోటిన్ జుట్టు ఒత్తుగా పెరుగడానికి ఉపయోగపడుతుంది.

ఈ నీటిలోని విటమిన్ బి3, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రంగు మారడాన్ని నిరోధించడంతో పాటు తేమను అందిస్తాయి. జుట్టు చివర్లు చిట్లకుండా ఉంటాయి.