ప‌వ‌న్ సినిమా చూసేందుకు బురఖా వేసుకుని మ‌రీ వెళ్లా

ప‌వ‌న్ సినిమా చూసేందుకు బురఖా వేసుకుని మ‌రీ వెళ్లా

#Anupama parameswaran

త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చోటు సంపాదించింది మ‌ల‌యాళ కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

Anupama

ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు సోష‌ల్‌మీడియాలో ఫొటో షూట్‌ల‌తో ఎప్పుడూ ఫ్యాన్స్‌కు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది.

ప్ర‌స్తుతం బ‌ట‌ర్ ఫ్లై సినిమాతో అనుప‌మ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌పెట్టింది.

ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధాన‌మిచ్చింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై అభిప్రాయం వెల్ల‌డించేంత స్థాయి త‌న‌కు లేద‌ని అనుప‌మ స్ఫ‌ష్టం చేసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద స్టార్ హీరో.. ఆయ‌నంటే నాకెంతో ఇష్ట‌మ‌ని, త‌న సినిమాలు చూస్తుంటాన‌ని చెప్పుకొచ్చింది.

భీమ్లా నాయ‌క్ సినిమాను హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూశాన‌ని బ‌య‌ట‌పెట్టింది.

బ‌ట‌ర్ ఫ్లై హీరో నిహాల్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లా నాయ‌క్ సినిమాకు వెళ్లొచ్చాన‌ని తెలిపింది.

త‌న‌ను గుర్తుప‌ట్ట‌కుండా బుర‌ఖా వేసుకుని మ‌రీ థియేట‌ర్‌కు వెళ్లొచ్చాన‌ని చెప్పింది.