బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన అను ఇమ్మాన్యుయెల్‌

చాలాకాలంగా సక్సెస్‌లు, ఆఫర్లు లేకుండా ఇబ్బంది పడుతున్న అను ఇమ్మాన్యుయెల్‌కు మంచి రోజులొచ్చాయి.

చాలా ఏళ్ల తర్వాత ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో అను ఇమ్మాన్యుయెల్‌ సక్సెస్‌ను అందుకుంది.

Anu emmanuel

ఈ సినిమాలో అను గ్లామర్‌తో పాటు నటనకు కూడా మంచి పేరు వచ్చింది.

ఊర్వశివో.. రాక్షసివో సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్న అనూకి ఇప్పుడు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తితో కలిసి నటించే ఛాన్స్‌ కొట్టేసింది అను ఇమ్మాన్యుయెల్‌.

anu emmanuel

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కార్తి హీరోగా వస్తున్న తాజా చిత్రం జపాన్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది.

anu emmanuel

ఈ సినిమాను మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టారు.

జపాన్‌ సినిమాలో సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.