Ivana

టాలీవుడ్‌కు మరో మలయాళ బ్యూటీ ఎంట్రీ

టాలీవుడ్‌లో మలయాళీ అమ్మాయిలకు మంచి డిమాండ్‌ ఉంది. కేరళ నుంచి వచ్చి ఇక్కడ స్టార్‌ హీరోయిన్లు అయిన వాళ్లు చాలామందే ఉన్నారు.

White Lightning
White Lightning

కీర్తి సురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, మాళవిక మోహనన్‌.. ఇలా చాలామంది టాలీవుడ్‌లో మంచి అవకాశాలను అందుకుంటున్నారు.

White Lightning

ఇప్పుడు వీళ్ల బాటలోనే మరో మలయాళ బ్యూటీ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

తాజాగా లవ్‌ టుడే సినిమాతో సక్సెస్‌ అందుకున్న ఇవానా ఇప్పుడు తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

White Lightning

దిల్‌ రాజు బ్యానర్‌లో తన అన్న కొడుకు ఆశిష్‌ హీరోగా వస్తున్న సినిమాలో ఇవానాను హీరోయిన్‌గా ఎంపిక చేశారని సమాచారం.

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా 2012లో ఇవానా మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కడ మూడు సినిమాలు చేసింది.

White Lightning
White Lightning

2018లో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జ్యోతిక హీరోయిన్‌గా వచ్చిన నాచియర్‌ ( ఝాన్సీ)లో కీలక పాత్ర పోషించింది.

ఝాన్సీ సినిమాలో అరసి పాత్రతో ఇవానా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఝాన్సీ సినిమా తర్వాత శివకార్తికేయన్‌ హీరో చిత్రంలోనూ ముఖ్యపాత్రలో నటించింది.

తాజాగా లవ్‌ టుడే సినిమాతో హీరోయిన్‌గా మారింది. భారీ హిట్‌ను అందుకుంది.

తమిళనాట 5 కోట్లతో రూపొందిన లవ్‌ టుడే చిత్రం 70 కోట్లకు పైగా వసూలు చేసింది.

తెలుగులో కూడా ఈ సినిమా మంచి సక్సెస్‌ అందుకుంది. ఈ క్రమంలోనే దిల్‌ రాజు బ్యానర్‌లో హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.