#Ananya Nagalla

నా కోసం వ‌రుడిని వెతికిపెట్టినందుకు థ్యాంక్స్‌

తెలుగ‌మ్మాయి అన‌న్య నాగ‌ళ్ల‌కు అందం ఉంది కానీ అదృష్టం త‌క్కువ అనే చెప్పాలి.

White Lightning
White Lightning

మ‌ల్లేశం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగ‌మ్మాయి.. రెండో సినిమాకే ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టించే ఛాన్స్ కొట్టేసింది.

White Lightning

త‌క్కువ టైమ్‌లో స్టార్ సినిమాలో న‌టించే ఛాన్స్ రావ‌డంతో ఇక అన‌న్య‌కు టాలీవుడ్‌లో తిరుగుఉండ‌ద‌ని అనుకున్నారు.

కానీ ఆ త‌ర్వాత అన‌న్య నాగ‌ళ్ల‌కు పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ అవ‌కాశ‌లేమీ రాలేదు.

White Lightning

అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తున్న అన‌న్య‌.. అవ‌కాశాల కోసం అందాల ఆరబోత‌కు కూడా ముందుకొచ్చింది.

పొట్టి దుస్తుల్లో హాట్ హాట్ ఫొటోల‌ను దిగి వాటిని సోష‌ల్ మీడియాలో పెడుతూ అంద‌ర్నీ త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.

White Lightning
White Lightning

అయిన‌ప్ప‌టికీ అన‌న్య నాగ‌ళ్ల‌కు పెద్ద అవ‌కాశాలేమీ రావ‌ట్లేదు. ఇలాంటి స‌మ‌యంలో అన‌న్య నాగ‌ళ్ల పెళ్లి వార్త వైర‌ల్‌గా మారింది.

Ananya Nagalla

టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర నిర్మాత రెండో కొడుకును ఆమె పెండ్లి చేసుకోబోతున్న‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి.

ఈ వార్త‌లు త‌న వ‌ర‌కు చేర‌డంతో అన‌న్య నాగ‌ళ్ల స్పందించింది. సెటైరిక‌ల్ రిప్లైతో రూమ‌ర్ల‌కు చెక్‌పెట్టింది.

నా కోసం వ‌రుడిని వెతికిపెట్టినందుకు థ్యాంక్స్‌. ప్లీజ్ అత‌ను ఎవ‌రో నాకు కూడా చెప్పండి. అంటూ ట్వీట్ చేసింది.

అంత‌టితో ఆగ‌కుండా పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ చేస్తున్నారో ద‌య‌చేసి చెబితే నా పెండ్లికి నేను రాగ‌ల‌ను అంటూ సైటైర్ వేసింది.